శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నందమూరి - మెగా ఫ్యామిలీ మధ్య 35 యేళ్లుగా పోరు : జూనియర్ ఎన్టీఆర్

తెలుగు చిత్రపరిశ్రమలో కొన్ని కుటుంబాలదే ఆధిపత్యం. వీటిలో ప్రధానంగా నందమూరి, మెగాస్టార్ కుటుంబాలు ఉన్నాయి. వీటితో పాటు.. దగ్గుబాటి, ఘట్టమనేని కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే, నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య పోటీపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 
 
తనతో పాటు మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ నటించిన "ఆర్ఆర్ఆర్" మూవీ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఈ విషయం చెప్పవచ్చో లేదో తనకు తెలియదుకానీ తమ రెండు కుటుంబాల మధ్య గత 35 యేళ్లుగా పోరు నడుస్తుందన్నారు. 
 
అయితే, తాను, రామ్ చరణ్‌లు మంచి స్నేహితులమన్నారు. తమ మధ్య పోరు ఎపుడూ సానుకూల ధోరణితోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన హీరోలంతా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
 
కాగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, సముద్రఖని తదితరులు నటించారు.