శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (15:28 IST)

చరణ్, NTR గిల్లుడు పంచాయతీ: ఎన్టీఆర్ ఉలిక్కిపడ్డాడు

దర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, జక్కన్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా హీరో అయిన రామ్‌చ‌ర‌ణ్‌, నంద‌మూరి హీరో అయిన ఎన్టీఆర్‌ల‌తో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు ఫిక్ష‌న‌ల్ పాత్ర‌ల మ‌ధ్య ఉండే భావోద్వేగాలు క‌ల‌యిక‌గా తెర‌కెక్కించారు. 
 
ఆ రెండు ఫిక్ష‌నల్ పాత్ర‌ల్లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఒదిగిపోయారు. ఈ సినిమా మేకింగ్ స‌మయంలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ మ‌ధ్య ఉన్న అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఎంత బ‌ల‌ప‌డిందంటే ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడుకోవ‌డం, భోజ‌నం చేయ‌డం.. ఒక‌రినొక‌రు ఆట ప‌ట్టించ‌డం వంటి ప‌నుల‌తో స్నేహం మ‌రో లెవ‌ల్‌కు చేరింది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్‌లోనూ ప్ర‌స్తావించారు. 
 
అయితే ఈ ప్రెస్‌మీట్‌లో మ‌రో గ‌మ్మ‌త్తైన విష‌యం జ‌రిగింది. ఫొటోగ్రాఫ‌ర్స్‌కు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి ఫోజులు ఇచ్చేట‌ప్పుడు ఎన్టీఆర్‌కు చ‌ర‌ణ్ చిన్న జ‌ర్క్ ఇచ్చాడు. ఎన్టీఆర్ న‌డుం మీద గిల్ల‌డ‌మే, చ‌క్కిలిగింత పెట్ట‌డ‌మో ఏదో చేశాడు. దాంతో ఎన్టీఆర్ ఉలిక్కిప‌డి ప‌క్క‌కు జ‌రిగి న‌వ్వేశాడు. దాంతో చ‌ర‌ణ్ కూడా న‌వ్వేశాడు. ఈ టీజింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.