బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:19 IST)

పుష్పరాజ్ మేకప్ కే రెండు గంటలు పట్టేది - మూడువేల థియేట‌ర్లో విడుద‌ల : నిర్మాతలు

Y.Ravishankar, Naveen Yerneni, CEO Cherry
అట‌వీ నేప‌థ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కువ‌గా వెళ్ళ‌ని ప్రాంతాల్లో రిక్కీ చేసి షూటింగ్ చేసిన సినిమా `పుష్ప‌`. ఒక్కోసారి లోప‌లికి వెళ్ళాలంటే గంట‌ల‌పాటు ప్ర‌యాణం, అల్లు అర్జున్ పాత్ర కోసం రెండు గంట‌ల మేక‌ప్ వేయాలి. తిరిగి వ‌చ్చాక దాన్ని తీయ‌డానికి గంట‌కుపైగా ప‌డుతుంది. ఇక లొకేష‌న్ల‌లో వాతావ‌ర‌ణ అనుకూలంగా లేక‌పోతే యూనిట్ అంతా క‌ష్ట‌మైనా ఇష్టంగా ప‌నిచేసి విడుద‌ల‌కు సిద్ధం చేశామ‌ని చిత్ర నిర్మాత‌లు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు పుష్ప నిర్మాతలు నవీన్  యెర్నేని, వై.రవిశంకర్‌, సీఇవో చిరంజీవి చెర్రీ తెలియ‌జేస్తున్నారు.
 
'పుష్ప' సెన్సార్ పూర్త‌యి  U/A సర్టిఫికెట్  పొందింది. డిసెంబర్ 17న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు సంస్థ కార్యాల‌యంలో మాట్లాడారు. అరుదైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎర్రచందనం అక్రమరవాణాతో పాటు మానవీయ విలువలు, భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచుతుంది. మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచే విధంగా పుష్ప చిత్రం వుంటుంది.
 
- ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందింది. పాన్ ఇండియన్ సినిమా చేయాలనే మా కల ఈ సినిమాతో తీరనుంది. దర్శకుడు సుకుమార్ చెప్పిన పుష్ప కథ వినగానే అన్ని భాషల వారికి చేరువ అయ్యే యూనివర్శల్ కథ అవుతుందనిపించింది..ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో సినిమాను విడుదలచేయబోతున్నాం..
 
- అరుదైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎర్రచందనం అక్రమరవాణాతో పాటు మానవీయ విలువలు, భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచుతుంది. రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠభరితంగా.. ఆసక్తికరంగా  సాగుతుంది. సినిమాలో ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ నటన అద్భుతం.. స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. మాస్ కథకు  క్లాస్ హంగులను మేళవిస్తూ అన్ని వర్గాల్ని అలరించేలా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. 
 
- దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటల్ని స్వరపరిచారు. ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలు సూపర్‌హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. సినిమా చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.  క్లిష్టమైన పరిస్థితుల్లో  ఇప్పటివరకు ఎవరూ వెళ్లని అరుదైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం.ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నాం. 
 
 -ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. ఆఖండ విజయం మాలోనూ ఉత్సాహాన్ని  నింపింది. ఆ విజయపరంపరను మా చిత్రం కొనసాగిస్తుందనే నమ్మకముంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త పంథాలో అల్లు అర్జున్ కనిపిస్తారు. చిత్తూరు యాసలో ఆయన చెప్పిన సంభాషణలు  మెప్పిస్తాయి. బన్నీ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమా కోసం ఏడాది మొత్తం పుష్పరాజ్ పాత్రలోనే ఉండిపోయారు.  ఆయన మేనరిజమ్స్ విభిన్నంగా ఉంటాయి. పుష్పరాజ్ పాత్రకు సంబంధించి ఆయన మేకప్‌కోసమే ప్రతిరోజు రెండు గంటలు సమయం పట్టేది. 
 
ఫహాద్‌ఫాజిల్ మా అందరి ఊహలకు మించి అద్భుతంగా నటించాడు.  రష్మిక మందన్న, సునీల్, అనసూయతో పాటు ప్రతి క్యారెక్టర్ సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ నవ్యరీతిలో సాగుతాయి. ప్రతీ భాషలోనూ చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌నే చూపించాం. పుష్ప సెకండ్‌పార్ట్ షూటింగ్‌ను ఫిబ్రవరిలో మొదలుపెడతాం. 
 
కొత్త చిత్రాలు 
ప్రస్తుతం మా సంస్థలో మహేష్‌బాబు సర్కారువారి పాట, నానితో అంటే సుందరానికి సినిమాలు చేస్తున్నాం.  చిరంజీవి సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. బాలకృష్ణతో చేయబోతున్న చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్‌పైకి తీసుకొస్తా. కల్యాణ్‌రామ్‌తో అమిగోస్ అనే చిత్రం  చేయబోతున్నాం అన్నారు.