బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:59 IST)

సెన్సార్ పూర్తి చేస్తున్న 'పుష్ప'రాజ్ - 'యూఏ' సర్టిఫికేట్ మంజూరు

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు "యూఏ" సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. దీంతో ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల 12వ తేదీన ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని యూసుఫ్ గూడా పోలీస్ మైదానంలో ఈ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా కోసం దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 
 
ఈ పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న విషయం తెల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మించింది. తొలిభాగం ఈ నెలలో విడుదల చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించగా, హాస్య నటుడు సునీల్, యాంకర్ అనసూయలు విలన్లుగా నటించినట్టు సమాచారం.