శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:37 IST)

భావోద్వేగ కథ 'ఆర్ఆర్ఆర్' :: చెర్రీ - తారక్ రెండు విభిన్న ధృవాలు : ఎస్ఎస్.రాజమౌళి

తన దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" చిత్రం కథపై దర్శకుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. భరతగడ్డపై పుట్టిన భావోద్వేగం(ఎమోషనల్)తో కూడిన కథగా అని చెప్పారు. 
 
సోమవారం రాత్రి చెన్నైలో జరిగిన తమిళ వెర్షన్ 'ఆర్ఆర్ఆర్' ప్రిరిలీజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్ర కథ భారత గడ్డపై పుట్టిన ఓ భావోద్వేగం అని అభివర్ణించారు. రెండు ఫిరంగుల్లాంటి రామ్ చరణ్, ఎన్టీఆర్‌ అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఎన్టీఆర్‌ను మిత్రుడిగా పేర్కొన్న రాజమౌళి... రామ్ చరణ్‌ను తన శిష్యుడుగా పేర్కొన్నారు. అయితే, వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛగా ఉండటం ఎలాగో రామ్ చరణ్ నుంచి తాను నేర్చుకున్నానని చెప్పారు. 
 
"ఎన్టీఆర్‌ను తిడుతుంటాను. టైమ్స్ సెన్స్ ఉండదు. నేను ఉదయం 7 గంటలకు రమ్మంటే 6 గంటలకే వచ్చేస్తాడు. నేను ఏదైనా మనసులో ఓ సీన్ అనుకుంటే చెప్పకముందే చేసి చూపిస్తాడు. తెలుగు తెరకేకాదు భారతీయ చిత్ర పరిశ్రమకే ఎన్టీఆర్ ఓ వరమన్నారు. 
 
ఇక చరణ్‌ను ఎక్కువగా మై హీరో అంటుంటాను. చరణ్ నుంచి నేను ఒక్క విషయం నేర్చుకున్నాను. సినిమా కోసం ఎంత చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు. ఓ ధ్యానంలో ఉన్నట్టుగా ఎంతో నిర్మలమైన మనసుతో ఉంటాడు. వాస్తవానికి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు రెండు భిన్న ధృవాలు. ఎన్టీఆర్ ఎపుడూ ఓ లక్ష్యం కోసం దూసుకుపోతున్న వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ, చెర్రీ మాత్రం ఖచ్చితమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపంలా కనిపిస్తాడు అని రాజమౌళి కితాబిచ్చారు.