1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 17 జనవరి 2022 (22:53 IST)

తిరుమలలో ఏకాంతంగా రామక్రిష్ణ తీర్థ ముక్కోటి

తిరుమల శేషాచలం అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామక్రిష్ణతీర్థ ముక్కోటి ఏకాంతంగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఏకాంతంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాలను నిర్వహించింది. 

 
ప్రతియేటా పుష్యమి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు శ్రీరామక్రిష్ణతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినం నాడు ఎక్కువమంది భక్తులు విచ్చేసి ఈ పర్వదినం నాడు తీర్థంలో స్నానాలు చేసే సాంప్రదాయం ఉన్నందు వల్ల భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు. 

 
శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ బయలుదేరి రామక్రిష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీక్రిష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేధ్యం సమర్పించారు. 

 
అలాగే తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలోను పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతియేడాది కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంధ్భంగా సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి కళ్యాణమండపంలో ఆస్థానం నిర్వహించారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు.