ఆలయాలతో ఆటలొద్దు: ఉపాసనకు మెగాస్టార్ చిరంజీవి క్లాస్  
                                       
                  
				  				   
				   
                  				  అసలే కరోనాతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని అనుకుంటున్న సమయంలో కోడలు ఉపాసన చేసిన పని పెద్ద తలనొప్పిగా మారింది చిరంజీవికి. ఏకంగా హిందూ సంఘాలకు ఆగ్రహం తెప్పించేలా ఉపాసన చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా తయారైంది. 
				  											
																													
									  
	
	 
	ముఖ్యంగా  ఆమె చేసిన ట్వీట్ పై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. గోపురం మీద మనుషుల బొమ్మలు పెట్టి ఆ బొమ్మను ఉపాసన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
				  
	
	 
	ఆలయాల పవిత్రతను  దెబ్బతీసే విధంగా ఉపాసన వ్యవహరించిందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ట్వీట్ ను డిలీట్ చేయడమే కాదు..యావత్ హిందూ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	
	 
	ఈ నేపథ్యంలో విషయం కాస్త చిరంజీవి దృష్టికి వెళ్ళింది. ఉపాసనకు ఫోన్ చేసి చిరంజీవి క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సున్నితంగానే మాట్లాడి ఇలాంటివి మన ప్రతిష్టను దిగజారుస్తాయి..ఆలయాలతో ఆటలొద్దు అంటూ చెప్పారట చిరంజీవి. 
				  																		
											
									  
	
	 
	అయితే ఉపాసన మాత్రం వెనకడుగు వేయడం లేదట. తాను చేసింది తప్పు కాదని సమర్థించుకుంటోందట ఉపాసన. అందుకే ఇప్పటికీ ఆ ట్వీట్ ను అలాగే ఉంచారట. కానీ హిందూ సంఘాలు మాత్రం దీనిపై అగ్గిలం మీద గుగ్గిలమవుతున్నారు.