బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (17:45 IST)

ఆంధ్ర‌లో మూడు స్లాబులో టికెట్ల ధరలు - ముత్యాల రామదాసు

Muthyala Ramadasu
గ‌త కొద్దిరోజులు నాడు ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రితో చిరంజీవి బృందం క‌లిసి సినిమా స‌మ‌స్య‌ల‌పై వివ‌రించింది. ఆ త‌ర్వాత కార‌ణం ఏద‌యినా `మా` అధ్య‌క్షుడు మంచు విష్ణు కూడా జ‌గ‌న్‌ను క‌లిశారు. తాజాగా ఆంధ్ర ప్ర‌భుత్వం కొన్ని నిర్ణ‌యాలు ఛాంబ‌ర్‌కు తెలియ‌జేసింది.   100 శాతం సీట్ల ఆక్యుఫెన్సీ అమలులో వచ్చింది. మాస్క్ తప్పనిసరి. అని ప్ర‌భుత్వం తెలియ‌జేసింది. ఈ విష‌యాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు గురువారంనాడు కొద్దిసేప‌టికి క్రిత‌మే తెలియ‌జేశారు. 
 
ఆయ‌న చెప్పిన విశేషాలు.  టికెట్ రేట్లపై అన్ని అంశాలు చర్చించాం.. టికెట్ల రేట్ల గురించే ఈ కమిటీ వేశారు..మేము అడిగిన వాటికి 99 శాతం దగ్గరగా ప్రభుత్వం అనుకూలంగా ఉంది.. మూడు స్లాబులో టికెట్ల ధరలు ఉంటాయి.. ఫిల్మ్ ఛాంబర్ తో చర్చించి మేము రేట్లు ప్రభుత్వం కి సూచించాం.. అతిత్వరలో ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుని ప్రకటిస్తుంది..ఎవ‌రేమి మాట్లాడినా ఇండస్ట్రీ కోసమే చిరంజీవి చర్చలు జరిపారు. టిక్కెట్ల పెంపుకు వీలుగా 100 కోట్ల బడ్జెక్టు పై ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ఉంటుంది. త్వ‌ర‌లో మంచివార్త వ‌స్తుంది అని తెలిపారు.