1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (17:24 IST)

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు... 100శాతం సీటింగ్‌కు ఓకే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో వంద శాంతి సీటింగ్‌కు అనుమతి ఇచ్చింది. శుక్రవారం నుంచి 100 శాతం సీటింగ్‌‍తో సినిమాలను ప్రదర్శించుకోవ్చని తెలిపింది. అయితే, కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రేక్షకులు విధిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా పెద్ద చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నెల 25వ తేదీన పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్", వరుణ్ తేజ్ "గని" చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆ తర్వాత  "సర్కారువారి పాట", "ఆర్ఆర్ఆర్", "రాధేశ్యామ్" వంటి చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.