ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 మార్చి 2022 (16:44 IST)

RRR చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ, ఏమన్నారో తెలుసా?

RRR చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "RRR మాస్టర్ స్టోరీ టెల్లర్ మాస్టర్ పీస్. ss rajamouli అసమానమైన సినిమాటిక్ విజన్‌కి ఒక గ్లోయింగ్ & మైండ్-బ్లోయింగ్ సాక్ష్యం.

 
ఈ చిత్రంలో పనిచేసిన మొత్తం టీమ్‌కు హ్యాట్సాఫ్." అని ట్వీట్ చేసారు. కాగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ కీలక పాత్రల్లో నటించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్ అతిథి పాత్రలో కనిపించాడు.

 
ఇండియన్ సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఇదే ఫస్ట్ రికార్డ్
రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డును తనే బీట్ చేసారు. కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం కలెక్షన్ల ‘సునామీ’ని సృష్టిస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు అతిపెద్ద ఓపెనింగ్ బాహుబలి: ది కన్‌క్లూజన్ రికార్డును బద్దలు కొట్టింది.
 
విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 223 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో, ఈ చిత్రం రూ. 156 కోట్లు వసూలు చేయగా, యుఎస్, కెనడా నుండి మరో రూ. 42 కోట్లు రాబట్టింది. బాహుబలి 2 తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.217 కోట్లు వసూలు చేసింది. ఐతే ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును దాటి రూ. 223 కోట్లు వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది.