గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (13:25 IST)

ఆర్ఆర్ఆర్‌పై బన్నీ.. బావా నువ్వు కుమ్మేశావ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించగా, వారి పర్ఫార్మెన్స్ గురించి బన్నీ తాజాగా ట్వీట్ చేశాడు. 
 
ముఖ్యంగా తారక్ చేసిన పర్ఫార్మెన్స్ గురించి బన్నీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తారక్-బన్నీ ప్రేమగా ఒకరినొకరు "బావా" అని పిలుచుకుంటారు. 
 
ఈ క్రమంలోనే "ఆర్ఆర్ఆర్"లో "బావా నువ్వు కుమ్మేశావ్.. నీ నటన చూస్తుంటే ఓ పవర్ హౌజ్‌ను చూస్తున్నట్లు అనిపించింది" అని తారక్ పర్ఫార్మెన్స్ గురించి ట్వీట్ చేశాడు బన్నీ.
 
ఇలా తారక్ నటన గురించి బన్నీ చేసిన కామెంట్‌ను అటు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలతో తారక్ పర్ఫార్మెన్స్ గురించి పలువురు సెలెబ్రిటీలు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 
 
తారక్‌ను చూసినంతసేపు తమకు గూస్‌బంప్స్ వచ్చాయని, ఆయన కెరీర్‌లోనే ఇది ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ కితాబిస్తున్నారు.