రాజమౌళిని 6 నెలలు జైలులో పెట్టాలి.. కేఆర్కే
ఆర్ఆర్ఆర్ సినిమాపై సెలెబ్రిటీలు తమ రివ్యూను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఈ సినిమాపై స్పందిస్తున్నారు. రాజమౌళి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ అని రివ్యూలు ఇస్తున్నారు.
అయితే బాలీవుడ్ విమర్శకుడు కేఆర్కే మాత్రం భారతీయ సినీ చరిత్రలో అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో వేయాలంటూ వ్యాఖ్యానించాడు.
"తప్పు చెప్పలేను. కానీ, దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరం. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో స్క్రాప్ మూవీ తీసిని రాజమౌళిని 6 నెలలు జైలులో పెట్టాలంటూ కేఆర్కే విమర్శించారు. సినిమా చూసినందుకు తన నాలెడ్జ్ జీరో అయిందని చెప్పాడు.