గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (21:42 IST)

ఆర్ఆర్ఆర్ ప్రీ బుకింగ్స్ అదుర్స్..

మార్చి 25న విడుదలవుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్‌లో అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్‌కు ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ దాటి తాజాగా 1.5 మిలియన్ డాలర్స్‌ని క్రాస్ చేసిందట. దీంతో ఇంకొన్ని రోజుల్లో అంటే విడుదల తేది కంటే ముందే.. 2 మిలియన్ మార్క్‌ను అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అయితే ఇలా ఓ భారతీయ సినిమా జరగడం రికార్డ్ అని అంటున్నారు. ఇప్పటికే ఎత్తర జెండా వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు. 
 
ఇక మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కావడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో ఈ సౌలభ్యం లేకపోవడంతో ఈ సినిమాను చూడాలనే వారికి ఇది చేదువార్తనే చెప్పోచ్చు. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. 
 
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నారు.  విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులో రానుంది.