1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (16:10 IST)

RRR Press Meet: చిక్కబల్లాపూర్‌‌లో ప్రీ-రిలీజ్‌

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. శుక్రవారం దుబాయ్ ఈవెంట్‌లో పాల్గొన్న ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇప్పుడు కర్ణాటకలో ఉంది. 
 
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. మార్చ్ 25న "ఆర్ఆర్ఆర్" మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇక రాజమౌళి చెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్‌లో రాజమౌళి సినిమా గురించి పలు విశేషాలను వెల్లడించారు. 
 
శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో “ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వేడుకకు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, ప్రెస్ మీట్ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ముందుగా మార్చ్ 17న "ఆర్ఆర్ఆర్"ను విడుదల చేయాలని అనుకున్నారట. కానీ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ "జేమ్స్" అదే రోజు విడుదలకు సిద్ధమవ్వడంతో వెనక్కి తగ్గారట. అందుకే "జేమ్స్" సినిమాకు వారం గ్యాప్ ఇచ్చి మార్చ్ 25న వస్తున్నట్టు "ఆర్ఆర్ఆర్" మేకర్ వెల్లడించారు.
 
కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ త్రయం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ “సినిమాలో చరణ్, నేను హీరోలము… కానీ విలన్ మాత్రం రాజమౌళి” అంటూ చమత్కరించారు.