గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (22:20 IST)

మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నెంబర్ 7 ఎందుకో తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నెంబర్ 7పై ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. నెంబర్ 7 ని వినియోగించడం వల్లే మహేంద్ర సింగ్ ధోని ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకోవడంతో పాటు టీమిండియా‌కు ప్రపంచ క్రికెట్‌‌లో అత్యుత్తమ స్థానంను కల్పించాడు అనడంలో సందేహం లేదు అంటూ చాలామంది బాహాటంగానే అనేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నెంబర్ 7 ను ధరించడంపై వస్తున్న వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు.
 
ఏడవ నెంబర్ ను ధరించడం వెనుక ఎలాంటి మూఢనమ్మకం గాని ఇతర భక్తి ఉద్దేశం గానీ లేదన్నాడు. కేవలం తన పుట్టిన రోజు జులై 7వ తారీకు అవడం వల్లనే తాను ఏడో నెంబర్ జెర్సీని వినియోగించాను అంటూ చెప్పుకొచ్చాడు. తాను పుట్టిన నెల 7 మరియు తారీకు 7. అలాగే పుట్టిన సంవత్సరం 81. 8 నుంచి 1 తీసేస్తే ఏడు వస్తుంది. కనుక 7తో తనకు ఎంతో అనుబంధం ఉంది. 
 
అందుచేతనే తన జెర్సీ నెంబర్‌ను నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పుట్టిన రోజు కంటే అత్యుత్తమ లక్కీ నెంబర్ ఏది ఉండదని అందుకే తాను 7ను లక్కీ నెంబర్ గా ఎంపిక చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.