#RRR మేనియా ... రెండో సిలిండర్ కొనుగోలు చేస్తే సినిమా టిక్కెట్లు ఉచితం
ఈ నెల 25వ తేదీన "ఆర్ఆర్ఆర్" చిత్రం విడుదలకానుంది. రిలీజ్‌కు మరో వారం రోజులు ఉంది. అయితే, 'ఆర్ఆర్ఆర్' సందడి మాత్రం అపుడే మొదలైంది. ఇటీవల ఈ చిత్రంలోని "ఎత్తర జెండా" పాటను రిలీజ్ చేసిన చిత్ర బృందం మరోమారు భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా "ఆర్ఆర్ఆర్" మేనియా మొదలైంది.
దీనికి నిదర్శనమే గుంటూరు జిల్లాలో ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ యజమాని ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు రెండో సిలిండర్ కొనుగోలు చేస్తే "ఆర్ఆర్ఆర్" మూవీ టిక్కెట్లను ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. అదీ కూడా సినిమా రిలీజ్ రోజున ఇంటికి వచ్చిన మరీ టిక్కెట్లు అందజేస్తామని ప్రకటించారు.
ఈ గ్యాస్ ఏజెన్సీ గతంలో "బాహుబలి-2" చిత్రం సమయంలోనూ ఇలాగే ఫ్రీ టిక్కెట్లు ప్రకటించింది. తాజాగా ప్రకటన చేసిన కాసేపటికే మూడు సిలిండర్లు బుక్ అయినట్టు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వెల్లడించారు. ఈ సినిమా టిక్కెట్లను దుగ్గిరాల సరోజిని థియేటర్‌లో సినిమా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.