బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (11:21 IST)

ఆర్ఆర్ఆర్ టిక్కెట్ల కోసం గోలగోల.. ఒంగోలులో వివాదం

ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల కోసం ఒంగోలులో వివాదం తలెత్తింది. మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు సమానంగా టికెట్లు ఇవ్వాలని థియేటర్‌ యాజమాన్యాం దగ్గరి పంచాయితీ పెట్టారు ఫ్యాన్స్‌. సినిమా టికెట్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు మెగా ఫ్యాన్స్‌.  
 
ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ కథానాయకులు నటించడం, ఫ్యాన్సీ షో టికెట్లు ఇవ్వాలని రెండువర్గాలు పట్టుబట్టడం.. పరోక్షంగా రాజకీయ నేతల హస్తం ఉండటంతో స్థానిక థియేటర్‌ వద్ద గందరగోళ పరిస్థితి కనిపించింది.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు థియేటర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చేందుకు యత్నించారు.
 
థియేటర్‌ వద్ద పరిస్థితి ఇలా ఉంటే చలనచిత్రం విడుదల సందర్భంగా పద్మశాలిపేటకు చెందిన కొందరు ఇద్దరు కథానాయకుల ఫొటోలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. హీరోల చిత్రాలకు రక్తతిలకం దిద్దారు.