శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (16:25 IST)

ఏప్రిల్ 8న రెడ్డిగారింట్లో రౌడీయిజం

Raman, Priyanka Rouri
సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వ‌ర్ష హీరోయిన్స్‌. సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించాయి. టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌, పాట‌ల‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుద‌ల చేస్తుంది. 
 
ఈ సంద‌ర్భంగా హీరో ర‌మ‌ణ్ మాట్లాడుతూ - ‘‘రియ‌ల్ ఎస్టేట్ రంగంలో  స‌క్సెస్ అయిన త‌ర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టి సిరి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించి అందులో తొలి ప్ర‌య‌త్నంగా  ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సినిమా చేశాం. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. అందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకముంది. మా సోదర సమానులైన దర్శకులు రమేష్, గోపి సినిమాను చక్కగా, ప్రతి ఒక్కరికీ నచ్చేలా రూపొందించారు. మా సినిమా టీజ‌ర్‌ను విడుదల చేసిన వి.వి.వినాయ‌క్‌గారికి పాటను విడుదల చేసి సపోర్ట్ అందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు. హైద‌రాబాద్‌, గోవా, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో  సినిమా షూటింగ్ చేశాం. సినిమాటోగ్రాఫర్ ఎ.కె.ఆనంద్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రముఖ  సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్‌గారు విల‌న్‌గా చేశారు. ఏప్రిల్‌ 8న స్క్రీన్ మ్యాక్స్ సంస్థ మా సినిమాని గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.
 
దర్శకులు ఎం. ర‌మేష్‌, గోపి మాట్లాడుతూ ‘‘సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. రమణ్‌గారు వన్ మ్యాన్ షో చేశారు. మా కథను నమ్మి సినిమాను నిర్మించిన శిరీషా రమణారెడ్డిగారికి థాంక్స్. మ‌హిత్ నారాయ‌ణ్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. మీ అంద‌రి ఆశిర్వాదంతో ఏప్రిల్‌ 8న మీముందుకు వ‌స్తున్నాం. మీ అంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.
 
నటీనటులు:
ర‌మ‌ణ్‌, ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష వినోద్ కుమార్‌, ర‌చ్చ ర‌వి, మిర్చి మాధ‌వి, జూనియ‌ర్ బాల‌కృష్ణ‌, శంక‌ర్‌, కృష్ణ‌, ప్ర‌కాష్ అడ్డా, వెంక‌ట్‌, సిద్ధు తది తరులు