శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (13:12 IST)

మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) విడుదల

Nitin first look
హీరో నితిన్ విలక్షణమైన క‌థాంశంతో MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తన 31వ చిత్రంగా న‌టిస్తున్న‌ చిత్రం మాచర్ల నియోజకవర్గం.. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా మేకర్స్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) నేడు విడుదల చేశారు.
 
"నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్ధార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే , మీరు మెచ్చే మాస్‌తో వస్తునా.. అంటూ  మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్ సంద‌ర్భంగా నితిన్ ట్వీట్ చేశారు. 
 
ఈ లుక్‌లో నితిన్‌ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. సీరియస్‌గా ఆలోచిస్తూ చూపించిన పోస్టర్ ఆకట్టుకుంది. త‌ను పోరాటానికి సిద్ధ‌మై దాడిని ఎదుర్కోవ‌డానికి రెడీగా కూర్చున్న‌ట్లుంది. మెడ‌లో వెండిలాకెట్‌ ధ‌రించిన నితిన్ వెనుక పులిచార‌లున్న బాడీతో మారణాయుధాలతో కొంద‌రు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాత‌ర‌లో జ‌రుగుతున్న యాక్ష‌న్ సీన్‌గా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ పోస్ట‌ర్‌ చూస్తే గూస్‌బంప్స్ వ‌చ్చేలా వుంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు.
 
ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టీన‌టులు కూడా న‌టిస్తున్నారు.
 
భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాహి సురేష్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
నటీనటులు: నితిన్, కేథరిన్ ట్రెసా, కృతి శెట్టి తదితరులు
 
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: MS రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
కెమెరా : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
లైన్ ప్రొడ్యూసర్: జి హరి
సంభాషణలు: మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
PRO: వంశీ-శేఖర్