శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:13 IST)

సీఎం జగన్ నివాసంలో కేంద్ర మంత్రి గడ్కరీకి ఆతిథ్యం

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం విజయవాడ పర్యటనకు వచ్చారు. విజయవాడలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక అభివృద్ధి పథకాల ప్రారంభోత్సం, కొత్త పథకాలకు శంకుస్థాపనలు చేశారు. బెంజి సర్కిల్‌లో కొత్తగా నిర్మించిన వంతెనకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.
 
ఈ పర్యటనలు పూర్తి చేసుకున్న తర్వాత మంత్రి నితిన్ గడ్కరీ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి విచ్చేశారు. అక్కడ గడ్కరీకి సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఈ జ్ఞాపికను కూడా అందజేశారు. ఆ తర్వాత వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ భేటీలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.