1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nitin will take charge first in Macherla constituency

మాచర్ల నియోజకవర్గంలో నితిన్ ఫస్ట్ ఛార్జ్ తీసుకోనున్నాడు

Macharla Niyojaka vargam
Macharla Niyojaka vargam order copy
యూత్‌ఫుల్ న‌టుడు నితిన్ హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెర‌కెక్కుతున్న చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. కేథరిన్ ట్రెసా, కృతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి  నిర్మిస్తున్నారు.
 
ఇటీవలే ఫైట్ మాస్ట‌ర్ అనల్ అరసు నేతృత్వంర‌లో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ కూడా పూర్తిచేసుకుంది.
 
ఈ సంద‌ర్భంగా, `మాచర్ల నియోజకవర్గం` ఫస్ట్ ఛార్జ్ పేరుతో ఫస్ట్ లుక్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో మేకర్స్ ముందుకు వచ్చారు. వినూత్నంగా మార్చి 26న  ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్న‌ట్లుగా ప్రభుత్వ ఉత్తర్వు  శైలిలో ప్రకటన విడుద‌ల చేశారు.
 
మ‌రోవైపు, : “ఐఏఎస్ అధికారి యొక్క కింది పోస్ట్ తక్షణమే అమలులోకి వస్తుంది - శ్రీ ఎన్ . సిద్ధార్థరెడ్డి, IAS (2022) గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. తన మొదటి ఛార్జ్‌ని మార్చి 26న ఉదయం 10:08 గంటలకు తీసుకుంటున్నారు. అంటూ ఆర్డ‌ర్ కాపీలో పేర్కొన్నారు.
 
గుంటూరులో జిల్లా కలెక్టర్‌గా కథానాయకుడు ఎదుర్కోబోయే సవాళ్లను సూచించేదిగా ఈ ఆర్డర్ కాపీ ఎర్ర‌టి మ‌ర‌క‌ల‌తో నిండి ఉంది. 
 
రాజ‌కీయ నేప‌థ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. అనుభవం గల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు.
 
భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్  మూడవసారి నితిన్‌తో కలిసి పనిచేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.
 
నటీనటులు: నితిన్, కేథరిన్ ట్రెసా, కృతి శెట్టి తదితరులు
 
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఎం.ఎస్‌. రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
కెమెరాః ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
లైన్ ప్రొడ్యూసర్: జి హరి
సంభాషణలు: మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
PRO: వంశీ-శేఖర్
About Writer
డీవీ
తర్వాతి కథనం
రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్ ప్రోమో ఆక‌ట్టుకునేలా గాలివాన వెబ్ సిరీస్