సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (17:04 IST)

ఇష్క్ టీమ్‌తో మ‌రో సినిమా చేయాల‌ని ఆశిస్తున్నా - నితిన్‌

Nitin, Nithya Menon
నితిన్, నిత్య మీనన్ జంట‌గా న‌టించిన సినిమా ఇష్క్. 2012, ఫిబ్రవరి 24న విడుద‌లై అద్భుత‌మైన విజ‌యాన్ని చ‌విచూసింది.  శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో విక్రం కె. కుమార్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించారు. నేటికి అంటే ఫిబ్ర‌వ‌రి 24కు విడుద‌లై ప‌దేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్రంలో న‌టించిన నితిన్, నిత్య మీనన్, విక్రం కె. కుమార్, పి.సి. శ్రీ‌రామ్‌, అనూప్ రూబెన్స్ త‌మ ఆనందాన్ని ఇలా ఆవిష్క‌రించారు.
 
హీరో నితిన్ మాట్లాడుతూ, ఈనెల 24కు ప‌దేళ్ళు ఇష్క్ పూర్తి చేసుకుంటుంది. నా కెరీర్‌లో మెమొర‌ల‌బుల్ సినిమా. న‌టుడిగా నాకు రీ బ‌ర్త్ ఇచ్చింది. ఇంత మంచి సినిమాను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ నాకు ఇచ్చారు. పి.సి. శ్రీ‌రామ్ కెమెరా అద్భుతంగా తీశారు. ఇష్క్ సినిమా స్పెష‌ల్‌గా రావ‌డానికి కార‌ణం క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం, పి.సి. శ్రీ‌రామ్ విజువ‌ల్స్‌, అనూప్, అర‌వింద్ మంచి సంగీతం ఇచ్చారు. నాది, నిత్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ డ్రీమ్ టీమ్‌తో మ‌రోసారి సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపారు.
 
నిత్య మీన‌న్ మాట్లాడుతూ, ఇష్క్ నా సెకండ్‌మూవీ. నా హృద‌యాన్ని ట‌చ్ చేసిన‌ సినిమా.. ఇప్పుడు కూడా ఎక్క‌డికి వెళినా. `ప్రియా ప్రియా` సాంగ్‌. పాడ‌మ‌ని అడుగుతుంటారు. అనూప్ నాచేత పాడించారు. మొద‌టి పేమెంట్ కూడా తీసుకున్నాను. విక్ర‌మ్ కుమార్ గారు క్యూట్ ఫిలింగా తీశారు. నాకు చాలా ఆనందంగా వుంది. అప్పుడే ద‌శాబ్దం అయిందా! అనిపించింది. అంద‌రం వేరే వేరే చోట వుండ‌డంతో సెల‌బ్రేష‌న్ చేసుకోలేక‌పోతున్నాం. త్వ‌ర‌లో క‌లుస్తాం అని చెప్పారు.
 
ద‌ర్శ‌కుడు విక్రమ్ కె. కుమార్ తెలుపుతూ, ఇష్క్ వ‌చ్చి అప్పుడే ప‌దేళ్ళు అని న‌మ్మ‌లేక‌పోతున్నాను. నిత్య‌, నితిన్ కెమిస్ట్రీ బాగా పండింది. పి.సి. శ్రీ‌రామ్ో విజువ‌ల్ వండ‌ర్ ఇచ్చారు. ఫ్రెష్‌గా చూపించారు. ఇక సంగీతం అనూప్ ఫెంటాస్టిక్‌గా ఇచ్చాడు. `ప్రియా.. చిన్న‌దానా నీకోసం, సూటిగా.. ఏదో ఏదో.. అనే పాట‌లు ఆహ్లాద‌క‌ర‌మైన ఆడియోగా పేరు తెచ్చుకున్నాయి. నా లైఫ్‌లో ఈ సినిమా రీ ఎంట్రీ అనుకోవ‌చ్చు. ఇంత ముఖ్య‌మైన సినిమాను నాకు ఇచ్చినందుకు నితిన్‌, సుధాక‌ర్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు. వారు నాపై న‌మ్మ‌కాన్ని వుంచారు. నా లైఫ్‌ను ఇష్క్ సినిమా మార్చేసింది. అని తెలిపారు.
 
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, అప్పుడే ప‌దేళ్ళు అయిపోయాయా! అనిపిస్తుంది.నాకు ఇది స్పెష‌ల్ మూవీ. మూవీ ల‌వ‌ర్స్ మంచి సినిమా ఇచ్చారు. మా అంద‌రికీ స్పెషల్ మూవీ. ఈ సినిమా బాగా రావ‌డానికిపి.సి. శ్రీ‌రామ్‌, విక్ర‌మ్ కుమార్‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ఈ నితిన్‌, సుధాక‌ర్ రెడ్డిగారికి ప‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌ని తెలిపారు.
 
పి.సి. శ్రీ‌రామ్ మాట్లాడుతూ, ప‌దేళ్ళు ఇష్క్ సినిమాకు వ‌చ్చేశాయా అనే ఆశ్చ‌ర్యం క‌లిగింది. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ ఏదైతే నా నుంచి కోరాడే అది వంద శాతం ఇచ్చాను. దానికి నిత్య‌, నితిన్ న‌ట‌న హైలైట్ అయింది. అనూప్ రూబెన్స్ సంగీతం అద్భుతంగా ఇచ్చాడు. రెండు చేతులు క‌లిపితే మేజిక్ అయిన‌ట్లు నిత్య‌, నితిన్ కెమెస్ట్రీతోపాటు అనూ రూబెన్స్ సంగీతం మాయ చేసింది. ఈ మేజిక్ ఇచ్చేలా చేసిన సుధాక‌ర్ రెడ్డిగారికి, నితిన్‌, విక్ర‌మ్ కుమార్‌గారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను  అని చెప్పారు.