శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (11:14 IST)

భోపాలీ అంటే ఆ అర్థం.. వివాదంలో ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు

ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి వివాదంలో చిక్కుకున్నారు. భోపాలీ అంటే హోమో సెక్స్‌వల్ అని అర్ధమంటూ తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయనను చిక్కుల్లో పడేసింది. ఈ వ్యాఖ్యల పరివసానం తీవ్ర దుమారం రేపింది. 
 
తానూ భోపాల్ వాడినేనని.. కానీ, తాను ఆ విషయాన్ని ఎక్కడా చెప్పనని వివేక్ అన్నారు. ఎందుకంటే భోపాలీ అంటే స్వలింగసంపర్కుడని పేర్కొన్నారు. అలాగే నవాబుల ప్రవర్తన అని కూడా అర్థముందని అన్నారు. 
 
ఇకపోతే.. వివేక్ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో విమర్శలు చుట్టుముట్టాయి. పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీ ప్రజలు, నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. 
 
వివేక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు అలాంటి అనుభవం ఉందేమో కానీ భోపాల్ వాసులకు అలాంటి అలవాటు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటరిస్తూ ఆయన వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా వివేక్ భోపాలీయులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.