చైతూని గుర్తుచేసుకున్న సామ్-మజిలీలా కలిసిపోవచ్చుగా..?
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయాక ఇప్పటివరకు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు, పోస్టులు పెట్టలేదు. తాజాగా సమంత ఓ పోస్ట్‌ని తన స్టోరీలో పెట్టడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
సమంత, చైతూ కలిసి చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా మజిలీ. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 3 సంవత్సరాలు అయింది. దీంతో సమంత తన ఇన్‌స్టా స్టోరీలో మజిలీ పోస్టర్‌ని పెట్టింది. అయితే సమంత సింగిల్ పోస్టర్ పెట్టకుండా, చైతూ సింగిల్‌గా ఉన్న పోస్టర్‌ని పెట్టింది. ఆ పోస్టర్‌లో వెనకాల చైతూ ఇద్దరు హీరోయిన్స్‌తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి.
సమంత ఇలా మజిలీ సినిమా పోస్టర్‌ని చైతూ ఫోటోతో పెట్టడంతో అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మజిలీ లాగా ఇద్దరు మళ్ళీ కలిసిపోవచ్చు కదా, ఇద్దరు ఆ సినిమాలో లాగా అర్ధం చేసుకొని బతకొచ్చు కదా అని కామెంట్స్ పెడుతున్నారు.
కొంతమంది అయితే అవన్నీ సినిమాల్లోనే రియల్ లైఫ్ వేరు అని అంటున్నారు. మొత్తానికి చైతూతో విడాకుల అనంతరం సమంత వారిద్దరూ కలిసి చేసిన సినిమా పోస్టర్‌ని పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.