బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (11:51 IST)

పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్.. నదిలో పడి వరుడు మృతి.. వధువు?

Wedding
Wedding
వెడ్డింగ్ షూట్‌ నవ దంపతుల కొంపముంచింది. కేరళలో సాహసోపేతమైన ఓ వెడ్డింగ్ షూట్‌లో వరుడు మృతి చెందాడు. వధువు పరిస్థితి విషమంగా వుంది 
 
వివరాల్లోకి వెళితే.. కోజికోడ్​ సమీపంలోని కుట్టియాడికి చెందిన నవ జంట ఫొటో షూట్​ చేస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. వధువు పరిస్థితి విషమంగా వుంది.
 
కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత షూట్​కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు. 
 
వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో రెజిల్​ మరణించగా.. కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.