సంబంధిత వార్తలు
- రోడ్డు ప్రమాదం-19 ఏళ్ల బాలుడిని అలా కాపాడిన సోనూసూద్
- కరోనాతో స్నేహితుడు చనిపోయాడు, అతని భార్యకు నేను అండగా ఉంటానంటూ...
- తెలంగాణాలో విషాదం : కారు టైర్లుపేలి ఇద్దరు దుర్మరణం
- షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కరోనా టీకా వల్ల నా కుమార్తె ప్రాణం పోయింది.. రూ.1000 కోట్లు చెల్లించండి...
మరో మూడు గంటల్లో పెళ్లి - రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం
మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సివుండగా రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం పాలయ్యాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఇంటి విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో జరిగింది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా క్రిస్టియన్ పల్లికి చెందిన భువనాల చైతన్య కుమార్ (35) అనే వ్యక్తి నారాయణపేట జిల్లాలోని తిర్మాలాపూర్‌లో ప్రభుత్వ టీచరుగా పని చేస్తున్నారు. ఇటీవల ఆయనకు వనపర్తి జిల్లాకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ వివాహం గురువారం ఉదయం 11 గంటలకు చర్చిలో జరగాల్సివుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా ఘనంగానే చేశారు.
అయితే, చైతన్య కుమార్ గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారులో జడ్చర్లకు బయలుదేరారు. మార్గమధ్యంలో నక్కలబండా తండా మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చైతన్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన చైతన్య తల్లిదండ్రులు బోరును విలపించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తర్వాతి కథనం