శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (07:57 IST)

కరోనా టీకా వల్ల నా కుమార్తె ప్రాణం పోయింది.. రూ.1000 కోట్లు చెల్లించండి...

కరోనా వైరస్ వ్యాప్తి చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలు వేస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మాత్రం ఈ కరోనా టీకాలు వికటిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ తండ్రి సంచలన ఈ కరోనా టీకాలపై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా టీకా తన కుమార్తె ప్రాణం తీసిందంటూ ఆరోపించారు. అందువల్ల తనకు రూ.1000 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతూ ఏకంగా బాంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర, నాసిక్‌లోని ఓ వైద్య కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న స్నేహాల్ అనే విద్యార్థిని గత యేడాది కోవిషీల్డ్ టీకా వేయించుకుంది. జనవరి 28వ తేదీన టీకా వేయించుకోగా మార్చి 1వ తేదీన ఆమె మరణించింది. దీంతో తన కుమార్తె మరణానికి కరోనా టీకానే కారణమంటూ మృతురాలి తండ్రి కోర్టును ఆశ్రయించాడు. 
 
ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైద్య సిబ్బంది మొత్తం కరోనా టీకాలు వేయించుకోవాలని, అది పూర్తిగా సురక్షితమని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వల్లే తన కుమార్తె కరోనా టీకాను వేయించుకుందని, కానీ, కరోనా టీకా వికటించి తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి తండ్రి లునావత్ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తన కుమార్తె మృతికి రూ.1000 కోట్ల పరిహారం చెల్లించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.