గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (10:56 IST)

తెలంగాణాలో విషాదం : కారు టైర్లుపేలి ఇద్దరు దుర్మరణం

తెలంగాణా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కార్లు టైర్లు పేలడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ సమీపంలో సాగర్ రహదారిపై జరిగింది. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ రహదారిపై వస్తున్న కారు టైర్లు ఒక్కసారిగా పేలిడంతో కారు బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై రంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.