మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (09:06 IST)

పటాన్‌చెరులో 60 కేజీల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ నగరంలోని పటాన్‌చెరులో ఏకంగా 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు ఈ నలుగురు వ్యక్తులకు సహకరించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఇలాంటివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో గంజాయి సాగు లేగా, అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం వస్తే చాలు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కూడా ఇదే జరిగింది. స్థానిక ఇక్రిశాట్ టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన అధికారులు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.