1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (16:45 IST)

దుబాయ్ పోలీస్ స్టేషన్ అద్భుతం: వర్మ ట్వీట్ (Video)

Varma_Dubai Police
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో వున్నారు. లడ్కీ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో వర్మ పాల్గొన్నారు. దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా టవర్స్‌లో వర్మ పాల్గొన్నారు. దుబాయ్ పర్యటనలో భాగంగా వర్మ ఓ స్మార్ట్ పోలీస్ స్టేషన్‌ను చూసి షాకయ్యారు. 
 
ఈ పోలీస్ స్టేషన్‌కు సంబంధించి దుబాయ్ పోలీసులు ఇన్‌స్టాలో పంచుకోగా.. ఆ వీడియోను వర్మ ట్వీట్ చేశారు. సదరు పోలీస్ స్టేషన్ ఇంత అందంగా వుంటుందని తాను ఏ మాత్రం ఊహించలేదన్నారు. ఇంకా ఆ వీడియోలో వర్మ మాట్లాడుతూ.. దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్‌ను చూస్తుంటే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టుగా ఉందన్నారు. 
 
భారత్‌లో పోలీస్ స్టేషన్లు ఎలా ఉంటాయో, అందుకు పూర్తి విరుద్ధంగా దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ వుందని చెప్పుకొచ్చారు. ఆ పోలీస్ స్టేషన్ బ్యూటీఫుల్‌గా వుందని చెప్పక తప్పట్లేదని వెల్లడించారు. ఈ పోలీస్ స్టేషన్ ఇతర దేశాలకు తప్పకుండా మార్గదర్శకంగా మారుతుందని వెల్లడించారు.