బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (10:12 IST)

రంగారెడ్డి జిల్లాలో దారుణం: చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి..?

రంగారెడ్డి జిల్లా దారుణం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. బడికి వెళ్లే యువతిని ఓ యువకుడు హిమాయత్ సాగర్ వద్ద ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అంతటితో ఆగకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కానీ తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు తల్లి రాజేంద్రనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.