శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (15:19 IST)

నువ్వు కోకోనట్ కర్డ్ ఎప్పుడు పంపిస్తున్నావు.. సమంత ఎవరిని అడిగిందో?!

టాలీవుడ్ హీరో నాగచైతన్య నుంచి విడిపోయాక హీరోయిన్ సమంత వార్తల్లో నిలవని రోజంటూ లేదనే చెప్పాలి. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో పలు పోస్ట్‌లు పెట్టింది. ఇందులో నువ్వు ఫేమస్ కోకోనట్ కర్డ్ ఎప్పుడు పంపిస్తున్నావు అంటూ అక్కినేని ఇంట్లో వంట మనిషిని అడిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
 
చైతూ నుండి విడిపోయిన తర్వాత కూడా సమంత అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కొందరితో సన్నిహితంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య రానా, మిహికాలకు విషెస్ కూడా చెప్పింది.
 
సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి కేరళ ట్రిప్పేసింది. సినిమాల సంగతికి వస్తే.. తమిళంతో పాటు తెలుగులోను సమంతకి మంచి క్రేజ్ ఉంది. 
 
ఈ అమ్మడు నయనతారతో కలిసి కాతువాకుల రెండు కాధల్ అనే సినిమా చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నట్టు విఘ్నేశ్ శివన్ చెప్పాడు. తెలుగులోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.