శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (09:02 IST)

మ‌ధుర క్ష‌ణాల్లో తేలియాడుతున్న స‌మంత‌

Samantha
న‌టి స‌మంత పెళ్ళి పెటాకుల త‌ర్వాత చాలా హ్యాపీగా వున్నానంటూ చెప్ప‌క‌చెప్పేసింది. ఇటీవ‌లే ఓ ఆంగ్ల ప్ర‌తికకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆ విష‌యాన్ని వెల్ల‌డించింది. త‌న స్నేహిలతో టూర్ వెళ్ళ‌డం ఇష్టమైన సినిమాలు చేయ‌డం మామూలైపోయింది. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే స‌మంత నేడు కొత్త ఫొటోల‌ను షేర్ చేసింది.
 
బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్‌లో వున్న ఈ ఫొటోలో సామ్ చిరు మందహాసంతో ఆలోచిస్తూ ఎంతో అందంగా కనిపించింది. ఫేస్‌లో గ్లో కూడా క‌నిపించిది. ఇలా ఫొటో పెట్టి, మధ్యలో మధుర క్షణాలు అని క్యాప్షన్ ఇచ్చింది. త‌ను ఇప్పుడిప్పులో సినిమాలు, షికార్ల‌లో బిజీగా వున్నానంటూ చెబుతున్న స‌మంత ఇంటి ద‌గ్గ‌ర ఖాలీ స‌మ‌యాల్లో ఒక‌ప్ప‌టి మ‌ధుర గుర్తులు గుర్తుచేసుకుంటుంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.


ఏదిఏమైనా పెళ్లి అనేది ఓ లంప‌టం ఇంత ఫ్రీగా వుండ‌వుగ‌దా అని కొంద‌రు రెచ్చిపోయి స్పందిస్తున్నారు. అందుకే హ్యాపీగా వుందంటున్నారు. ఇంత‌కీ స‌మంత ప్రేమ క‌థా చిత్రాలు చేయ‌డానికి ప‌నికిరాద‌ని కొంద‌రు అందుకే పురాణ క‌థ‌లైన యశోద, శాకుంతలం చిత్రాలలో న‌టిస్తుంద‌ని చిలిపి కామెంట్లు కూడా వ‌చ్చాయి. త‌మిళంలో  కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో నటిస్తోంది.