శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (07:18 IST)

సమంత సరసన మాజీ క్రికెటర్ న‌టిస్తున్నాడు

Samantha
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయన్‌ సమంత, స్టార్‌ నయనతార కీలక పాత్రలలో నటిస్తున్న తమిళ సినిమా కాతువాకుల రెండు కాదల్‌. ఇందులో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కథానాయకుడు. నయన్‌ ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమాలో ఒకప్పటి టిమిండియా ఆటగాడు కీలక రోల్‌ పోషిస్తున్నట్లు తాజాగా సినిమా యూనిట్ ప్రకటించింది.
 
 టిమిండియా బౌలర్‌, నటుడు శ్రీశాంత్‌ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా  నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీశాంత్‌ మహ్మద్‌ మోబీ అనే పాత్రలో కనిపించనున్నాడు. మరో ఆసక్తికర సమాచారం ఏమిటంటే ఈ సినిమాలో శ్రీశాంత్‌, సమంత సరసన పలు సీన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఇక ఇప్పటికే  శ్రీశాంత్‌ ఓ సినిమాతో హీరోగా పరిచయమవగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేదు.