1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Samantha comments on ex husband nagachaitanya

చైతన్య ఫర్‌ఫెక్ట్ జెంటిల్ మ్యాన్ - సమంత

Samantha
అక్కినేని హీరో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత చైతూ గురించి ఎప్పుడు మాట్లాడని సామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాజీ భర్త క్యారెక్టర్‌ని బయటపెట్టింది. తన వద్ద డబ్బులు లేని సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తి చైతూ అని చెప్పుకొచ్చింది.
 
"ఒకానొక సమయంలో నేను చైతన్యతో కలిసి షూటింగ్ చేసేటప్పుడు నా దగ్గర కనీసం అమ్మకు కాల్ చేసి మాట్లాడడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నా పరిస్థితిని అర్ధం చేసుకున్న చైతన్య.. వెంటనే నా దగ్గరకు వచ్చి తన ఫోన్ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడమని చెప్పాడు. చైతన్య ఫర్‌ఫెక్ట్ జెంటిల్ మ్యాన్.. ఫైనాన్షియల్‌గా చైతూ తనను ఆదుకున్నాడని.." చెప్పుకొచ్చింది.  
తర్వాతి కథనం
ఇద్ద‌రూ వాడుకుని వ‌దిలేశారు - కరాటే కళ్యాణి