డబ్బుల్లేక చదువు మానేయాల్సి వచ్చింది.. రూ.500ల కోసం? సమంత
డబ్బుల్లేక చదువు మానేయాల్సి వచ్చిందని.. డబ్బు కోసం ఎన్నో కష్టాలు పడ్డానని టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలిపింది. చదువులో తాను టాప్ స్టూడెంట్ అయినప్పటికీ డబ్బులు లేక ఇబ్బంది పడ్డానని తెలిపింది.
హీరోయిన్ కాకముందు పెద్దపెద్ద ఫంక్షన్లలో అతిథులకు వెల్ కమ్ చెప్పే అమ్మాయిగా కూడా పని చేశానని వెల్లడించింది. ఈ పని చేసినందుకు నిర్వాహకులు తనకు రోజుకు రూ. 500 ఇచ్చేవారని చెప్పింది.
అంతేకాదు, పాకెట్ మనీ కోసం మోడలింగ్ దిశగా అడుగులు వేసే సమయంలో తల్లిదండ్రుల పోత్సాహంతో ముందుకెళ్లానని తెలిపింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.