హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్
హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, తనకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి అనేక మంది వెనుకాడారాన్నారు.
తాను వేదికపైకి వచ్చేటపుడు అనేక మంది పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. కానీ, అనేక దీపావళి శుభాకాంక్షలు చెప్పాలా వద్దా అంటూ భయపడ్డారు. కానీ తాను చెప్పేది ఒక్కటే, హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు.
వీటిపై తమిళనాడు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఘాటుగా స్పందించారు. డీఎంకే ఒక హిందూ వ్యతిరేక పార్టీ అంటూ మండిపడ్డారు. ఇతర మాతల వారికి శుభాకాంక్షలు చెప్పేటపుడు మాత్రం కేవలం విశ్వాసం ఉన్నవారికే అనే మాటను డీఎంకే నేతలు ఉపయోగించరని ఆమె గుర్తు చేశారు. హిందూ మతం విషయానికి వచ్చేసరికి వివక్ష చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడుని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.