శుక్రవారం, 8 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఆగస్టు 2025 (09:18 IST)

చీకట్లో ఏకాంతంగా గడిపిన ప్రేమికులు.. పట్టుకుని గుండు గీయించిన స్థానికులు...

crime
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట చీకటిలో ఏకాంతంగా కలుసుకుంది. దీన్ని గుర్తించిన స్థానికులు వారిని పట్టుకుని గుండు గీయించి, గ్రామంలో ఊరేగించారు. ఇది బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని రహతా గ్రామానికి చెందిన 40 యేళ్ల షకీల్, 32 యేళ్ళు సునీత మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరికీ ఇదివరకే పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు. వారు రహస్యంగా కలుసుకోగా గ్రామస్థులు గుర్తించి పట్టుకున్నారు. 
 
ఈ విషయం బయటపడగానే షకీల్ భార్య పోలీసులను ఆశ్రయించి సాయం అర్థించింది. స్థానిక పంచాయతీ పెద్దల ఆదేశాల మేరకు ఈ జంటపై గ్రామస్థులు దాడి చేశారు. అంతటితో ఆగని వారు.. వారికి గుండు గీయించి, గ్రామంలో ఊరేగించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఈ అమానుష చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు వెల్లడించారు.