గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (17:13 IST)

పూరీ -రౌడీ హీరో JGMకు షాక్.. ఏం జరిగిందో తెలుసా?

Vijay Devarakonda, Puri Jagannadh
పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండల కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఆగస్టు 25న విడుదల కాబోతుంది. లైగర్ మూవీ విడుదల కాకముందే పూరి, విజయ్‌ల కాంబో మరో పాన్ ఇండియా సినిమాకు రంగం సిద్ధం చేసింది. 
 
అంతేగాకుండా  JGM టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రకటించారు. మిలిటరీ నేపథ్యమున్న కథతో తెరకెక్కబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టే తెలిసిపోతుంది. తాజాగా జేజీఎం చిత్రబృందానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఈ చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
అయితే, కరణ్ సోలోగా కాకుండా ఇతర ఇన్వెస్టర్లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీరందరి సూచన మేరకు పూరి కొన్ని లీగల్ ఎడ్వైజ్‌లను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో, కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాధ్ సింగ్ ను పూరి బృందం కలుసుకుని, జేజీఎం కధకు అప్రూవల్ అడిగారు. 
 
ముంబై మహానగరాన్ని మిలిటరీ ఫోర్సులు చుట్టుముట్టే కథ కావడంతో భారతదేశ ప్రభుత్వం, డిఫెన్స్ రెండు కూడా JGM కథను సినిమాగా మార్చేందుకు అంగీకరించలేదు. దీంతో షాక్ తిన్న పూరీ టీమ్ కథలో మార్పు కోసం ప్లాన్ చేస్తున్నారట.