గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:22 IST)

పార్టీ మహిళా కార్యకర్తపై అత్యాచారం చేసిన టీకాంగ్రెస్ నేత

victim
తెలంగాణ రాష్ట్రంలో సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ నేత అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణానికి పాల్పడింది కూడా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి కావడం గమనార్హం. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాధితురాలు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఈ ఫిర్యాదులో శివకుమార్ రెడ్డి తనకు మద్యం తాపించి నగరంలోని ఓ హోటల్‌లో తనపై అత్యాచారం చేశారని, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు దీన్ని ఓ వీడియోను రికార్డు చేసినట్టు పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నానని, గత 2020లో మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి, పార్టీకి సమన్వయం చేసే బాధ్యతలు కూడా నిర్వహించినట్టు చెప్పారు. 
 
అయితే, ఈ ఫిర్యాదుపై పోలీసులు మరోలా స్పందిస్తున్నారు. పార్టీ పని నిమిత్తం ఈ ఇద్దరూ దుబ్బాకలోని ఓ హోటల్‌లో ఉన్న సమయంలో మద్యంమత్తులో ఉన్న సదరు మహిళ గదికి వచ్చి తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. 
 
దీనికి అంగీకరించకపోవడంతో తనపై శారీరంకాగ దాడికి దిగినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని వివరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివకుమార్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 420, 476, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.