శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ప్రియుడుతో కలిసి కుమార్తెను చంపేసిన కసాయి తల్లి

victim
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధాన్ని అడ్డుగా ఉందని భావించిన కసాయి తల్లి పేగు తెంచుకుని పుట్టిన ఆడబిడ్డను తన ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారు ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బతుకుదెరువు కోసం విజయావడ నుంజి నిజామాబాద్‌కు వచ్చిన దుర్గ అనే మహిళకు రైల్వే స్టేషన్ వద్ద పనిచేసే శ్రీను అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, తమ అక్రమ సంబంధానికి కుమార్తె అడ్డుగా ఉందని భావించింది. 
 
దీంతో తన ప్రియుడితో కలిసి కుమార్తెను దుర్గ భవానీ హత్య చేసింది. బాలిత తండ్రి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన మక్లూర్ పోలీసులు కుమార్తెను హత్య చేసిన కసాయి తల్లితో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.