సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2022 (20:47 IST)

సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం మెడికల్ కళాశాలలు ఎందుకు అడగటంలేదు?

KCR
తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు కావాలని అభ్యర్థనలు రాలేదనీ, సీఎం కేసీఆర్ కేంద్రానికి అడగక పోవడం వల్ల తెలంగాణకు కళాశాలలు రాలేదని తెలంగాణ భాజపా పేర్కొంది.
 
ట్విట్టర్లో పేర్కొంటూ... ''తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపింది? 'సున్నా'.. ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు అత్యున్నత ప్రభుత్వ వైద్య కళాశాలలను అతి తక్కువ సమయంలో నిష్పక్షపాతంగా ప్రధాని శ్రీ @narendramodi మంజూరు చేశారు." అని పేర్కొంది.