శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మునుగోడులో బీజేపీ గెలిస్తే తెరాస ప్రభుత్వం పతనం ఖాయం : రోజగోపాల్ రెడ్డి

komatireddy rajagopal reddy
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, తన రాజీనామాతో మునుగోడుకు జరిగే ఉప ఎన్నిక ఫలితంపై దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నారు. ఇక్కడే జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిస్తే మాత్రం తెరాస ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. 
 
అదేసమయంలో తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తాను మునుగోడును వదిలిపెట్టి వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. తెరాసలో చేరితేనే విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారని ఆరోపించారు. అసలు తెరాస ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌తో మాట్లాడే దమ్మూ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.