గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (19:59 IST)

రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటన: బీజేపీని సాగనంపాలని పిలుపు

kcrao
తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కొంగరకలాన్ లోని జిల్లా సమీకృత కలక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌కు సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాన్ని సాగ‌నంపాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడే ఈ దేశం, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. జాతీయ రాజ‌కీయాల్లో పిడికిలి ఎత్తాలి. మన రాష్ట్రం కూడా బంగారు తెలంగాణగా త‌యార‌వుతుంది. ఆ మ‌హాయ‌జ్ఞంలో తెలంగాణ భాగ‌స్వామ్యం కావాలి. ప్రజస అనుమ‌తితో ఆ ప‌నికి తాను జెండా ఎత్తుతానని కేసీఆర్ పేర్కొన్నారు. 
 
ఇంకా సీఎం మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా తెలంగాణ‌కే బంగారు కొండ‌గా మారింద‌ని పేర్కొన్నారు. ఎక‌రం భూమి ఉన్న వ్య‌క్తి కూడా పెద్ద కోటీశ్వ‌రుడు. ఈ మ‌త పిచ్చిల ప‌డి దాన్ని చెడ‌గొట్టుకోవాలా. నీచ రాజ‌కీయాల కోసం రాష్ట్రాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తుంటే చూసి ఊరుకోవ‌ద్దు. 
 
తెలంగాణ స‌మాజం ప్ర‌శాంతంగా ఉంది. అద్భుత‌మైన‌టువంటి ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో అభివృద్ధి జ‌రుగుతుంది. ఈ దుర్మార్గులు, చిల్ల‌ర‌గాళ్లు, మ‌త పిచ్చిగాళ్ల మాయ‌లో ప‌డొద్ద‌ని కేసీఆర్ సూచించారు.