తెలంగాణ రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా, ఈ తరహా యూనివర్శిటీని తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేశారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థిని నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దీన్ని ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యాలయాలను నిర్మించారు.
ఈ యూనివర్శిటీ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వైరల్ అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. ఈ విద్యాలయానికి సంబంధించిన ఫోటోలను తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సతీష్ రెడ్డి ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.