శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (17:51 IST)

"సారు దొర - సెలవు దొర" పోస్టర్లకు ఈసీ నో.. షాకైన తెలంగాణ బీజేపీ

bandi sanjay
తెలంగాణ రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆయన పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో "సాలు దొరు.. సెలవు దొర" అనే ప్రచార వాల్‌పోస్టర్లను ముద్రించారు. వీటికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. 
 
రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని ఖరాఖండీగా ఎన్నికల కమిషన్ తెలిపింది. సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది. సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బీజేపీ దరఖాస్తు చేసుకుంది. బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
 
కొద్ది రోజుల క్రితం 'సాలు దొర - సెలవు దొర' అంటూ బీజేపీ కార్యాలయం వెలుపల కొన్ని ప్రకటనలు వెలిశాయి. తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఈ ప్రకటన బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పిన మాటలు.. అభివృద్ధి పనులను చేస్తానని చెప్పి చేయలేకపోయినవి.. మ్యానిఫెస్టో.. ఇంటికో ఉద్యోగం..  కేజీ టు పీజీ ఉచిత విద్య.. జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి.. ముఖ్యమంత్రిగా దళితుడు, మూడెకరాల భూమి పంపకం, దళితబంధు.. గిరిజనులకు ఇస్తనన్న పన్నెండు శాతం రిజర్వేషన్లు.. ఈ అంశాలన్నింటినీ గుర్తు చేస్తూ.. ఇవేమీ చేయలేదని నిందిస్తూ 'సాలు దొర.. సెలవు దొర!' ప్రకటనను బీజేపీ వైరల్ చేసింది.