సంబంధిత వార్తలు
- 11-08-2022 బుధవారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా...
- ఏపీలో ఉత్తమ స్కూల్స్ ఇవే... ఎంపిక చేసిన సర్కారు
- రేపటి నుంచి యూఏఈలో 'సీతారామం' రిలీజ్
- 10-08-2022 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి...
- ఆగస్టు 10వ తేదీన కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్; కస్టమర్లు రు.1,999తో గెలాక్సీని ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు
టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆగస్టు 15న జన్మిస్తే...
ఈ నెల 15వ తేదీన 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకోసం దేశం యావత్తూ సిద్ధమవుతుంది. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
ఆగస్టు 15వ తేదీన జన్మించే శిశువులకు వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించనున్నట్లు సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు.
అలాగే, 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ నెల 21 వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. 75 ఏళ్లు పైబడినవారికి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి 75 శాతం రాయితీపై మందులు అందించనున్నట్లు తెలిపారు.
తర్వాతి కథనం
