మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (14:58 IST)

రేపటి నుంచి యూఏఈలో 'సీతారామం' రిలీజ్

sitaramam
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం "సీతారామం". యుద్ధంతో రాసిన ప్రేమకథ. ఈ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సూపర్ హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు కురిపిస్తుంది. అయితే, ఈ చిత్రం యూఏఈలో 11వ తేదీ నుంచి విడుదలకానుంది. 
 
ఈ సినిమాలో మతపరమైన కొన్ని సీన్స్ ఉన్నాయని, వాటిని డిలీట్ చేయాలని యూఏఈ సెన్సార్ బోర్డు చెప్పింది. ఈ సీన్లను తొలగించడంతో గురువారం యూఏఈలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అన్నిఫార్మాలటీస్‌ను పూర్తి చేసి గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హిట్ టాక్ రావడంతో యూఏఈలో కూడా ఓ రేంజ్‌లో ఓపెన్సింగ్ ఉంటాయని భావిస్తున్నారు. 
 
కాగా, వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానరులో హను రాఘవపూడి దర్శకత్వంలో సి.అశ్వనీదత్, స్వప్న అశ్వనీదత్‌లు నిర్మించారు.