గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (13:17 IST)

బిగ్ బాస్ షోనుంచి లోగో రిలీజ్.. అదిరిందిగా..?

Bigg boss
Bigg boss
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు నుంచి కొత్త లోగో వచ్చేసింది. బిగ్‌బాస్ షోకు వున్న ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా.. ఓటీటీ వేదికగా ఒక సీజన్ పూర్తైంది. బుల్లితెరపై ఆరో సీజన్ కోసం ఎంతో అతృతగా ఎదరుచూస్తున్న వారికి బిగ్‌బాస్ టీమ్ శుభవార్త చెప్పింది.
 
ఆరో సీజన్‌కు సంబంధించిన లోగో వచ్చేసింది. లోగో చూస్తుంటే ఎంతో క్రియేటివిటీగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తొలి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యతగా వ్యవహరించగా.. 3,4,5 సీజన్లకు కింగ్ నాగార్జున హోస్టింగ్ చేశారు. ఆరో సీజన్‌కు సైతం నాగార్జుననే వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు. ఇక ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో ఆరో సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.