గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (12:25 IST)

జగనన్న తోడు నిధులు- రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాల విడుదల

ys jagan
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న తోడు నిధులను విడుదల చేయనుంది. 
 
ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేలు వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. ఈ క్రమంలో 3.95 లక్షల మందికి రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది. 
 
అంతేకాకుండా గత ఆరు నెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ రీ-ఇంబర్స్‌మెంట్‌నూ విడుదల చేయనున్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.48.48 కోట్లు వడ్డీని చెల్లించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.